పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

ఠాగూర్

సోమవారం, 21 జులై 2025 (16:49 IST)
పెద్ద హీరోలతో నటించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, చిన్న హీరోలతో నటిస్తేనే హీరోయిన్లకు మంచి పేరు వస్తుందని ప్రముఖ హీరోయిన్ నిత్యా మీనన్ వెల్లడించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిత్యా మీనన్.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. "అలా మొదలైంది" చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నిత్యామీన్.. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషా చిత్రాల్లో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి "భీమ్లా నాయక్" చిత్రంలో నటించారు. 
 
తాజాగా బడా హీరోలపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పెద్ద హీరోల సినిమాల్లో నటించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని నిత్య చెప్పింది. చిన్న హీరోల సినిమాల్లో నటిస్తేనే హీరోయిన్లకు మంచి పేరు వస్తుందని, కిక్ ఉంటుందని తెలిపింది. తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఆ చిత్రంలో నటిస్తానని చెప్పింది. అందుకే సినిమాలకు లాంగ్ బ్రేక్ తీసుకున్నానని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు