'స్కిల్ గ్యాప్' సమస్య పరిష్కారానికి ఒక కమిటీ నియమించి, నివేదిక ప్రకారం కరికులమ్ లో మార్పులకు శ్రీకారం చుడతామని మంత్రి తెలిపారు. పరిపాలన విధానంలో కొత్త ఒరవడి సృష్టించేందుకు ఐఎస్ బీ తో ప్రభుత్వం భాగస్వామ్యమైట్లు మంత్రి పేర్కొన్నారు.
కోవిడ్ విజృంభణపై భవిష్యత్ లో జరగబోయేది ముందే చెప్పి ప్రజలను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దార్శనికతను మంత్రి కొనియాడారు. కోవిడ్ కలిసి బతకాల్సిందేనని ప్రజలను అప్రమత్తం చేసిన ఏకైక తొలి సీఎం అని పరీక్షలు, దేశంలోనే టాప్ లో నిలబడిన వివరాలను ప్రస్తావించారు.
గత ప్రభుత్వం అనుభవం ద్వారా అబద్ధాల మాటలు, ప్రచారం కోసం ప్రగల్భాలు పలకవద్దనేదే మా ప్రభుత్వం ముందు నుంచి పెట్టుకున్న నియమం, లక్ష్యమని మంత్రి తెలిపారు.