జూన్ నెలలో రెండవ విడత నేతన్న నేస్తం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన చేనేతల జాబితా, పూర్తి వివరాలు, ఆన్‌లైన్ పోర్టల్ అప్ లోడింగ్, వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి పేర్కొన్నారు.
వస్త్ర పరిశ్రమ ప్రాముఖ్యతను, ఉత్పత్తుల నాణ్యతను, ప్రచారాన్ని పెంచి చేనేతల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశమని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో చేనేత,జౌళి శాఖ డైరెక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.