ఏపీలో నిరుద్యోగుల కోసం 1180 పోస్టులు... నోటిఫికేషన్ విడుదల
గురువారం, 29 జులై 2021 (18:22 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగుల కోసం కొత్తగా 1180 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది జగన్ ప్రభుత్వం. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఈ మేరకు ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసింది.
జూన్ 18వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుబంధంగా లేటెస్ట్‌గా ఉద్యోగాలను వార్షిక జాబ్ క్యాలండర్‌లో చేర్చాల్సిందిగా ఆదేశాల్లో స్పష్టం చేసింది.
ఈ పోస్టులన్నింటికీ ఆగ్రవర్ణాల పేదలకు ఇచ్చే రిజర్వేషన్(ఈబీసీ)ను వర్తింపచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రెవెన్యూ విభాగం జూనియర్ అసిస్టెంట్‌లు సహా వేర్వేరు విభాగాల్లో 1180 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఏపీపీఎస్సీ.