వైష్ణవి అభివృద్ధి చేసిన యాప్ వల్ల కంప్యూటర్ లో ముఖ్యమైన డేటా చోరీకి గురయ్యే అవకాశం లేదు. అంతే కాకుండా ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలపై సైబర్ ఎటాక్ జరిగే అవకాశం తక్కువ. దీన్ని గుర్తిఃచిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కమిటీ వైష్ణవి ప్రతిభను ప్రశంసిస్తూ గిన్నిస్ సర్టిఫికెట్ ను ప్రధానం చేసింది.
బ్లాక్ చైన్ టెక్నాలజీని సక్రమంగా ఉపయోగించడం, అభివృద్ధి చేయడం వల్ల అత్యంత ముఖ్యమైన కంప్యూటర్ సమాచారానికి పూర్తి రక్షణ ఏర్పడుతుందని వైష్ణవి పేర్కొంది. ఈ సందర్భంగా యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థిని వైష్ణవి ని ప్రత్యేకంగా అభినందించింది.