తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో ఇటీవల చిరంజీవి అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. తన కుమారుడు చిరంజీవి కనిపించడం లేదంటూ చెరుకుపల్లికి చెందిన బల్లేపల్లి సుబ్బారావు వారం రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలను కనుగొన్నారు.