గుంటూరులో ఓ కరోనా పేషెంట్ ఆస్పత్రి భవనంపై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో తీవ్ర గాయాలవ్వడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు ఇలా వున్నాయి... గుంటూరు మారుతీ నగర్‌కు చెందిన ఓ వృద్దుడికి కొద్దిరోజుల క్రితం కరోనా సోకింది. దీంతో మంగళగిరి మండలం చినకాకానిలోని ఎన్నారై ఆస్పత్రిలో చేరాడు.
అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నాడు. అదే క్రమంలో శుక్రవారం ఆగస్టు 14, ఉదయం ఆస్పత్రిలో మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది అతన్ని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు.