ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు బలపడి రాష్ట్రంలో వర్షాల జోరు పెరుగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ నెల 23 వరకు కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 32 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కడప, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో తీవ్ర వర్షాభావం ఉంది. కాగా, బుధవారం రాష్ట్రంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.