నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

ఐవీఆర్

మంగళవారం, 15 జులై 2025 (18:03 IST)
తను వైసిపికి చెందిన నాయకుడిని అని తెలిసినా తన కుటుంబాన్ని ఆదుకున్న దేవుడు నందమూరి బాలకృష్ణ అంటున్నారు వైసిపి నాయకుడు సిద్దారెడ్డి. తనకు బాలయ్య చేసిన సాయం జన్మలో మరవలేమని చెపుతున్నారు.
 
సిద్దారెడ్డి మాట్లాడుతూ... నేను బ్లాక్ ఫంగస్ జబ్బుతో బాధపడుతున్నాను. ఆ సమయంలో నాకు సాయం అందలేదు. విషయం బాలయ్యకు తెలిసి నాకు అయిన వైద్య ఖర్చులన్నీ భరించి వైద్యం చేయించారు. ఆయనవల్లనే నేను బ్రతికి బయటపడ్డాను.
 
నా కుమార్తెలను పైచదువులకు వెళ్లేందుకు సాయం చేసారు. అమెరికా వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సాయం చేసారు. నాకు వైద్యానికి అయిన రూ. 15 లక్షల వరకూ భరించారు. అందుకే దేవుడు ఫోటోల పక్కన బాలయ్య ఫోటో పెట్టుకున్నాము అని చెప్పారు సిద్దారెడ్డి.

Ma balayya

బ్లాక్ ఫంగస్ తో బాధపడుతున్న YCP నాయకుడు సిద్దా రెడ్డి కి సాయం అందించిన బాలయ్య....

సుమారు 15లక్షలు ఖర్చు అయ్యే వైద్యం ఉచితం గా అందించారు...

తన కూతురు చదువుకి, US వెళ్ళడానికి కూడా సాయం చేసాడు...#balayya pic.twitter.com/Af7EhTSuHb

— Sree(@urstrulymanth) July 15, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు