వారంలో ఒకరోజు కాక ప్రతి రోజు ఫిర్యాదుదారుల ఫిర్యాదులను అర్జీల రూపంలో స్వీకరించి సత్వర న్యాయం అందించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఫిర్యాదుదారుల ఫిర్యాదుల పట్ల పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు. స్వీకరించిన ఫిర్యాదుల లో తగు విచారణ జరిపి 24 గంటల్లోనే సత్వర న్యాయం స్పందించేలా కృషి చేస్తామని తెలిపారు.
జిల్లాలోని ప్రజలు హెల్ప్ లైన్ నెంబర్లకు సంప్రదించి జిల్లాలోని మీ సమస్యకు పరిష్కారం పొందవచ్చు. అనునిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించడమే స్పందన ధ్యేయం అని తెలిపారు. జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తాను ఏ ప్రాంతంలో అయితే పర్యటిస్తానో అక్కడ స్పందన కార్యక్రమానికి అందుబాటులో ఉంటానని ఎస్పీసిద్ధార్థ కౌశల్ తెలియజేశారు.