కృష్ణా జిల్లాలో పెరుగుతున్న గంజాయి వాడకం

శనివారం, 27 జూన్ 2020 (09:36 IST)
కృష్ణా జిల్లాలో గంజాయి వాడకం పెరుగుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు భారీగా పట్టుబడుతుండడమే ఉదాహరణ. ఇటీవలి కాలంలో వెయ్యి కిలోలకు పైగా గంజాయి పట్టుబడినట్లు సమాచారం.

తాజాగా గుట్టుచప్పుడు కాకుండా రెండు కార్లలో గంజాయిని లోడు చేసుకుని విజయవాడకు తరలిస్తున్న నలుగురు గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 40 కిలోల గంజాయి, రెండు కార్లు, 3 సెల్ ఫోన్లు స్వాదీనము చేసుకున్నట్లు నూజివీడు డి‌ఎస్‌పి బుక్కాపురం శ్రీనివాసులు తెలిపినారు. 
 
హనుమాన్ జంక్షన్ సీఐ, ఆగిరిపల్లి ఎస్సై కిషోర్, వీరవల్లి ఎస్సై చంటిబాబు సిబ్బందితో కలసి నూజివీడు సబ్ డివిజన్, ఆగిరిపల్లి మండలము, ఈదులగూడెం గ్రామ సమీపములో వాహనములు తనిఖీ చేయుచుండగా విశాఖపట్నం నుంచి నూజివీడు మీదుగా విజయవాడకు అక్రమముగా రెండు కార్లలో 40 కిలోల గంజాయి తరలిస్తున్నట్లు తేలింది.

దీంతో దానిని స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు