ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం బెంగళూరుకు చేరుకున్నారు. రాత్రికి ఎలహంకలోని తన నివాసంలో బస చేయనున్నారు. సీఎం పెద్ద కుమార్తె హర్షారెడ్డి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్ బిజినెస్ స్కూలులో సీటు దక్కించున్న విషయం తెలిసిందే. తన కుమార్తెను పారిస్‌కు పంపేందుకు వైఎస్ జగన్ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు.