ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ.. పవన్‌ను టార్గెట్ చేసిన జగన్

సోమవారం, 11 నవంబరు 2019 (13:41 IST)
ఆంధ్రప్రదేశ్ పాఠశాల్లలో ఇంగ్లీష్ మీడియం కంపల్సరీపై వస్తున్న విమర్శలపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారు. అయ్యా సినిమా యాక్టర్ పవన్ కల్యాణ్ గారు అంటూ జగన్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. పవన్ కల్యాణ్‌కు ముగ్గురు భార్యలు... నలుగురో ఐదుగురో పిల్లలు కూడా ఉన్నారన్నారు.
 
పవన్ తన పిల్లల్ని ఎక్కడ ఏ మీడియంలో చదవిస్తున్నారని ప్రశ్నించారు. పవన్‌తో పాటు.. వెంకయ్యనాయడు, చంద్రబాబును తమ పిల్లల్ని ఎక్కడ చదవించారని ప్రశ్నించారు. ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే మన పిల్లలే నష్టపోతారన్నారు. మన జాతి, మనరాష్ట్రమే నష్టపోతుందన్నారు. మనపిల్లలకు మనం ఇచ్చే అతి గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువేనని జగన్ వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు