ఒక్కసారి జనసేన వైపు చూడండి, దేశం మీద ఒట్టేసి చెప్తున్నా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

మంగళవారం, 16 ఆగస్టు 2022 (14:05 IST)
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పార్టీ కార్యకర్తలను, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తన కడశ్వాస వరకూ రాజకీయాల్లో వుంటానని పునరుద్ఘాటించారు. దేశం మీద ఒట్టేసి చెపుతున్నా... రాజకీయాలు వదిలేది లేదు, ఇక్కడే వుంటానన్నారు.

 
ప్రజలు ఒక్కసారి జనసేనవైపు చూడాలన్నారు. మీరు పదవి ఇస్తే పదవితో సేవ చేస్తాం, మీరు ఇవ్వకపోతే పదవి లేకుండానే సేవ చేస్తాము. కానీ రాజకీయాలను మాత్రం వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. పరాజయం పాలైనప్పటికీ, అధికారం చేతిలో లేనప్పటికీ ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పారు.
 

వచ్చే ఎన్నికల్లో ఒక్కసారి జనసేన వైపు చూడండి - JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/iEbe3XawBA

— JanaSena Party (@JanaSenaParty) August 16, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు