పీకే చింపేశారు.. శభాష్ అంటూ మహేష్ కత్తి ప్రశంసలు

మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (08:53 IST)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సినీ విమర్శకుడు కత్తి మహేష్ ప్రశంసల వర్షం కురిపించాడు. అవిశ్వాస తీర్మానంపై పవన్ స్పందన భేష్ అంటూ ట్వీట్ చేశారు. ఏపీ హక్కుల సాధన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమనీ, దానికి అవసరమైన మద్దతును పవన్ కళ్యాణ్ కూడగడుతారా అంటూ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరిన విషయం తెల్సిందే. 
 
దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. జగన్ మోహన్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్టన్టు తెలిపారు. అయితే, వైకాపా ఎంపీల ద్వారా అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు పంపించాలంటూ పవన్ కోరారు. ఇక ఎంపీల మద్దతును తాను కూడగడుతానని ప్రకటించారు. 
 
దీనిపై కత్తి మహేష్ స్పందించారు. అవిశ్వాస తీర్మానంపై పవన్ స్పందన బేష్ అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు పీకే సరైన లైన్‌లోకి వచ్చారని.. తన నుంచి కోరుకునేది ఇదేనని తెలిపారు. ఆయన ఆలోచన విధానాన్ని.. అనుసరిస్తున్న వ్యూహాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నానని కత్తి చెప్పారు. ఏపీ ఎంపీలపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. అంతేకాదు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, వామపక్షాల మద్దతు కూడగట్టి బలం పెంచుకోవాలని మహేశ్ పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు