అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

సెల్వి

గురువారం, 31 అక్టోబరు 2024 (19:41 IST)
Minister Nara Lokesh
మంత్రి నారా లోకేష్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించే పనిలో పడ్డారు. ప్రస్తుతం, నారా లోకేష్ అమెరికా పర్యటనలో వున్నారు. అమెరికా పర్యటనలో విరామం తీసుకోకుండా ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో చర్చిస్తున్నారు. 
 
ప్రస్తుతం నారా లోకేష్ టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజా, పెరోట్ గ్రూప్ ఛైర్మన్ రాస్ పెరోట్ జూనియర్, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సమావేశాలు నిర్వహించారు. పెప్సికో మాజీ సీఈవో ఇంద్రా నూయిని కూడా కలిశారు.
 
గురువారం గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌తో తన సమావేశానికి సంబంధించిన చిత్రాలను నారా లోకేష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. "శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ క్యాంపస్‌ని సందర్శించాను, అక్కడ నేను గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌ని కలిశాను" అని లోకేష్ సోషల్ మీడియాలో రాశారు. 
 
ఇదిలావుండగా, టెక్ పరిశ్రమలోని ప్రభావవంతమైన వ్యక్తులతో నారా లోకేష్ సమావేశాలపై తెలంగాణకు చెందిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌కు మంచి భవిష్యత్తు ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.
 
రాష్ట్రానికి ఇలాంటి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి తమ సొంత ప్రభుత్వం తగినంత చర్యలు తీసుకోవట్లేదని కొందరు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మండిపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు