ఒంగోలులో నూతన క్రికెట్ మైదానం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్ర క్రికెట్ అసోసియే షన్ (ఏసీఏ) ఆపరేషన్స్ డైరెక్టర్, భారత మాజీ క్రికెటర్ వై.వేణుగోపాల్ తెలిపారు.
ఒంగోలు వచ్చిన ఆయన నగరంలోని మంగ మూరురోడ్డు మర్రిచెట్టు సమీపంలో అభివృద్ధి చేస్తున్న స్టేడియం పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి ఏసీఏ సహాయ, సహకారాలు అందిస్తుందని తెలిపారు.
కొన్ని కారణాల వలన శర్మ కళాశాల మైదానం విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా క్రికెట్ సంఘం అడ్‌హక్ కమిటీ కోరిక మేరకు ప్ర త్యామ్నాయంగా పదేళ్లపాటు ఏంవోయూ పద్ధతిలో స్థలాన్ని తీసుకొని అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.
నూతనంగా ఏర్పాటు చేస్తున్న క్రికెట్ సబ్ సెంటర్లు క్రీడాకా రులు ప్రాక్టీస్‌కు ఎంతో ఉపయోగపడతాయన్నారు.