న్యూ ఇయ‌ర్ వేడుక‌లు లేన‌ట్లే! దేశవ్యాప్తంగా రెండు రోజులు లాక్ డౌన్?

గురువారం, 16 డిశెంబరు 2021 (10:53 IST)
జ‌న‌వ‌రి ఫ‌స్ట వ‌చ్చేస్తోంది. ఎంచ‌క్కా హేపీ న్యూ ఇయ‌ర్ వేడుక‌లు జ‌రుపుకోవ‌చ్చ‌ని ఉబ‌లాట‌ప‌డుతున్నారా?  ఈ ఏడాది అంత సీన్ లేద‌ని హెచ్చ‌రిస్తోంది... కోవిడ్-19. కొత్త వేరియంట్ల‌తో విజృంభించేందుకు సిద్ధ‌మైన ఒమిక్రాన్... ఈసారి న్యూ ఇయ‌ర్ అంటూ, ఎవ‌రూ బ‌య‌ట‌కు కూడా రాకుండా చుట్టేస్తోంది.
 
 
కోవిడ్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు కేంద్రం కూడా కొత్త నిబంధ‌న అమ‌ల్లోకి తెస్తున్న‌ట్లు తెలుస్తోం ది.  ఈ  డిసెంబర్ 31, జనవరి 1వ‌ తేదీన రెండు రోజుల పాటు దేశం మొత్తం లాక్ డౌన్ ను విధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 
 
గుంపులుగా కలిసి ఈ వేడుకలు జరుపుకోవడం వలన ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. కాబ‌ట్టి, న్యూఇయ‌ర్ నాడు, దానికి ముందు రోజు ఎవ‌రూ ఇళ్ళ‌లో నుంచి బ‌య‌ట‌కు రాకుండా లాక్ డౌన్ విధించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. తిరిగి జనవరి 3, 2022న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు