వస్త్రాలపై జీఎస్టీ 5 నుండి 12 శాతం పెంచేస్తారా? ఇక బ‌ట్ట‌లు కొన‌లేం!

బుధవారం, 15 డిశెంబరు 2021 (11:41 IST)
విజయవాడలోని కృష్ణవేణి క్లాత్ మార్కెట్ లో వస్త్ర వ్యాపారులు పెద్ద ఎత్తున‌ ఆందోళన ప్రారంభించారు. కేంద్ర ప్ర‌భుత్వం వస్త్రాలపై జియస్టీ 5 నుండి 12 శాతం పెంచడంపై ఈ పోరాటం ఆరంభం అయింది. వస్త్ర వ్యాపారులు త‌మ దుకాణాల‌ను బంద్ చేసి ఉద్య‌మిస్తున్నారు.
 
 
బట్టలు అనేవి ప్రతి ఒక్కరికీ అవసరం. అందుకే కూడు, గూడు, గుడ్డ అని మన పెద్దలు చెప్పారు. 
అటువంటి వస్త్ర రంగంపై వ్యాట్ ట్యాక్స్ లు వేశారు. గ‌తంలోనే కేంద్రం ఐదు శాతం జిఎస్టీ వేసి మరింత భారం మోపింది. ఇప్పటికే వ్యాపారాలు తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నాం, తాజాగా కేంద్రం జియస్టీ ని ఐదు నుండి 12శాతానికి పెంచ‌డం దారుణ‌మ‌ని విజయవాడలోని కృష్ణవేణి క్లాత్ మార్కెట్ లో వస్త్ర వ్యాపారులు గ‌గ్గోలు పెడుతున్నారు. 
 
 
జనవరి 1 నుండి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంద‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. దీనితో కేంద్రం నిర్ణయాన్ని  వ్యాపారులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామ‌ని ఆందోళ‌న‌కు దిగారు. దీని వ‌ల్ల వినియోగదారులపై కూడా రెట్టింపు భారం పడుతుంద‌ని, ఐదు శాతం జియస్టీ తగ్గించమంటే, దానిని 12శాతం పెంచడం ఎంతవరకు సబబు అని వ్యాపారులు ప్ర‌శ్నిస్తున్నారు. ఐదు లక్షల సరుకు కొనుగోలు చేస్తే, అరవై వేలు జియస్టీ కట్టాల‌ని, ఇలా అయితే వస్త్ర రంగం పూర్తిగా దెబ్బ తింటుంద‌ని చెప్పారు. కేంద్రం పునరాలోచన చేసి జియస్టీ పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల‌ని డిమాండు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు