ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు వైద్య కాలేజీలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ కాలేజీలను గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ, విశాఖ జిల్లా పాడేరు, కృష్ణా జిల్లా మచిలీపట్నం ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి పవార్ తెలిపారు. ఈ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు.
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఏపీలో 13 ప్రభుత్వ వైద్య కాలేజీలు ఉన్నట్టు తెలిపారు.