ఏపీలోని క్వారంటైన్ లలో సమృద్ధి కరమైన, పౌష్టికాహారం ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చినవారికే కాకుండా, ఇటీవల ఢిల్లీలో మర్కజ్ కు వెళ్లొచ్చినవారిని కూడా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
గన్నవరం, నూజివీడు, గంగూరు (విజయవాడ డివిజన్) క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారికి అరటిపండ్లు, కోడిగుడ్లు, బాదంపప్పు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, ఎండు ఖర్జూరం వంటి బలవర్ధకమైన ఆహారం అందిస్తున్నారు.