Kadambari, vinod baal and team
హైదరాబాద్ లో మనం సైతం కాదంబరి ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ష్యూర్ ఆడియో టెక్నాలజీస్ (Shure Audio Technlogies ) సంస్థ వారి CSR సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. హైదరాబాద్ చిత్రపురి కాలనీలోని ఎల్ఐజీ ప్రాంగణంలో రెనోవా హాస్పిటల్ విద్యానగర్ వారి సహకారంతో 'మనం సైతం కాదంబరి ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో వందలాది మంది పాల్గొని, వైద్య సేవలను పొందారు. ఈ శిబిరంలో కంటి, దంత, బీపీ, హార్ట్, వెయిట్, బీఎంఐ, కాన్సర్, హోమియో, బీఎండీ వంటి వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు.