అమరావతిలో ఆమె మాట్లాడుతూ, డ్వాక్రా రుణమాఫీ చేసి మహిళలకు అండగా నిలబడిన ముఖ్యమంత్రిని మహిళా ద్రోహి అనడానికి ఎమ్మెల్యే రోజాకు నోరెలా వచ్చిందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, మహిళలకు ఆస్తిహక్కు, మహిళా విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి, మహిళలకు సముచిత గౌరవం కల్పించినట్టు చెప్పుకొచ్చారు.