పవన్ కల్యాణ్ ఉగాది శుభాకాంక్షలు... రైటింగ్ స్టైల్ అదిరింది.. ప్రత్యేకత ఏంటంటే?

బుధవారం, 29 మార్చి 2017 (09:40 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉగాదిని పురస్కరించుకుని వినూత్నమైన రీతిలో శుభాకాంక్షలు తెలియచేస్తూ విడుదల చేశారు. ఈ పత్రికా ప్రకటనలో కూడ పవన్ ప్రత్యేకతను కనబరిచారు. భావయుక్తంగా పవన్ అల్లిన మాటలు ఈ ప్రకటనకు మంచి హుందాతనాన్ని తెచ్చి పెట్టాయి.
 
'ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగువారందరికీ దేశ ప్రజలకు నా తరపున జనసేన సైనికుల తరపున హేవళంబి నామ ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ప్రకృతి అనుకూలించి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని అభివృద్ధిపథంలో తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉండాలని కోరుకుంటున్నాను. గడచిన దుర్ముఖి నామ సంవత్సరం తమకు పెద్దగా మేలుచేయలేకపోయిందన్న భావనతో ఉన్న తెలుగు ప్రజల ఆశలు హేవళంబి వసంతంలో అయినా నెరవేరాలని ఆశిస్తున్నాను. రాష్ట్ర విభజన నాటి హామీలు సంపూర్ణంగా అమలు కావాలన్న ప్రజల కోరిక ఫలించాలని ఆకాంక్షిస్తున్నాను. రైతులు చేనేత కళాకారులు శ్రామిక వర్గాలతోపాటు దేశంలోని ప్రతీ కుటుంబానికి శాంతి సౌభాగ్యాలను ఈ నూతన సంవత్సరం ప్రసాదించాలని జనసేనపార్టీ కోరుకుంటోంది.` అంటూ తన ఉగాది శుభాకాంక్షలసందేశాన్ని ముగించాడు పవన్ కల్యాణ్. 
 
ఇకపోతే.. ప్రజా సమస్యలపై స్పందించడానికి వీలుగా ప్రాంతాల వారిగా కొంతమంది నిష్ణాతులైన వ్యక్తులను నియమించుకునే పనిలో ప్రస్తుతం పవన్ బిజీగా ఉన్నాడు పవన్ కల్యాణ్. ప్రాంతాలవారిగా ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న యువతీ యువకులను స్పీకర్స్ గాను రైటింగ్ స్కిల్స్ వున్నవారిని కంటెంట్ రైటర్స్ గా ఎంపిక చేయడం కోసం పవన్ ఒక వినూత్న కార్యక్రమం ప్రారంభించాడు. అలాంటి కంటెంట్ రైటర్స్‌తో రాసిందే పవన్ ఉగాది శుభాకాంక్షలు. 

వెబ్దునియా పై చదవండి