జగన్ పార్టీలో చేరనున్న పురంధేశ్వరి?

ఆదివారం, 27 జనవరి 2019 (16:10 IST)
2019 ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ మేరకు హైదరాబాదులోకి జగన్ ఇంటికి వెళ్లిన దగ్గుబాటి వెంకటేశ్వర రావు తన కొడుకుతో భేటీ అయ్యారు. విజయసాయి రెడ్డి వారిని సాదరంగా ఆహ్వానించి లోపలకు తీసుకెళ్లారు. 
 
దగ్గుబాటి వెంకటేశ్వర రావు భార్య, ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి ప్రస్తుతం బీజేపీ నేతగానూ, ఎయిరిండియా బోర్డులో స్వతంత్ర డైరక్టర్‌గా కొనసాగుతున్నారు. ప్రకాశం జిల్లాలో పర్చూర్ స్థానంపై దృష్టి సారించిన దగ్గుబాటి ఫ్యామిలీ తమ కుమారుడు  హితేశ్ చెంచురాంను ఇక్కడి నుంచి పోటీ చేయించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం త్వరలోనే వైకాపాలో చేరే అవకాశం వుందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఏపీలో భారతీయ జనతా పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేవు. అధికారంలోకి కాదు కదా.. కనీసం ప్రతిపక్షంలోకి లేదా మూడో స్థానంలో కూడా నిలబడే పరిస్థితి లేదని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే గత 2014లో గెలిచినన్ని ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుస్తారా అనే చర్చ సాగుతోంది. 
 
ఈ కారణంగానే బీజేపీకి చెందిన ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరారు. ఏపీలో బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా లేనందునే దగ్గుబాటి ఫ్యామిలీ వైసీపీ వైపు చూస్తోందని అంటున్నారు. ప్రస్తుతం టీడీపీ, వైసీపీ, జనసేనలు మాత్రమే బలంగా ఉన్నాయని అంటున్నారు.
 
ఏపీలో భారతీయ జనతా పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేవు. అధికారంలోకి కాదు కదా.. కనీసం ప్రతిపక్షంలోకి లేదా మూడో స్థానంలో కూడా నిలబడే పరిస్థితి లేదని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే గత 2014లో గెలిచినన్ని ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుస్తారా అనే చర్చ సాగుతోంది. 
 
ఈ కారణంగానే బీజేపీకి చెందిన ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరారు. ఏపీలో బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా లేనందునే దగ్గుబాటి ఫ్యామిలీ వైసీపీ వైపు చూస్తోందని అంటున్నారు. ప్రస్తుతం టీడీపీ, వైసీపీ, జనసేనలు మాత్రమే బలంగా ఉన్నాయని చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు