వరకట్నం వేధింపులకు సంబంధించి గతంలో ధర్మ మహేశ్‌కు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇప్పటివరకు ధర్మ మహేష్ సింధూరం, డ్రింకర్ సాయి వంటి చిత్రాల్లో హీరోగా నటించాడు. ధర్మా మహేష్ అలియాస్ కాకాని ధర్మసత్య సాయి శ్రీనివాస మహేష్(30)కు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి (31)తో 2019లో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు.
గౌతమితో పాటు ఆమె తండ్రి అందించిన ఆర్థిక సహకారంతో ఇద్దరు కలిసి ఓ హోటల్ ఫ్రాంచైజీ వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. కాగా ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు పెరగడంతో జల్సాలకు అలవాటు పడిన ధర్మా మహేష్, యువతులతో తిరుగుతూ భార్యను వేధింపులకు గురి చేయసాగాడు.
ఇంకా వరకట్నం తేవాలని వేధించడం మొదలెట్టాడు. ధర్మ మహేష్, అతని కుటుంబ సభ్యుల శారీరక, మానసికవేధింపులకు విసిగిపోయిన భార్య గౌతమి పోలీసులను ఆశ్రయించింది. దీంతో గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ లో హీరో ధర్మా మహేష్ మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.