అమిత్ షా ఓ గల్లీ లీడర్... బ్రిటీష్ తొత్తు ఆర్ఎస్ఎస్: ఎస్.జైపాల్ రెడ్డి

శనివారం, 5 నవంబరు 2016 (16:44 IST)
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.జైపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయనో గల్లీ లీడర్ మంటూ మండిపడ్డారు. అలాగే, క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బ్రిటీష్ వారికి ఆరెస్సెస్ తొత్తుగా పనిచేసిందని దుయ్యబట్టారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ దేశానికి జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరూ రెండు కళ్లలాంటివారని, పటేల్‌ను పొగుడుతూ, నెహ్రూను విమర్శించడం అనైతిక చర్య అని వ్యాఖ్యానించారు. 
 
నెహ్రూ, పటేల్ ఇద్దరూ దాదాపు పదేళ్లు జైలు జీవితం గడిపినా... ఇద్దరి మధ్యా ఏనాడూ అభిప్రాయభేదాలు తలెత్తలేదని గుర్తుచేశారు. హైదరాబాద్ నిజాంపై చేపట్టిన సైనిక చర్య పటేల్ ఒక్కరి సొంత నిర్ణయం కాదని... నెహ్రూతో కలసి తీసుకున్న నిర్ణయమని జైపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి