విద్యార్థినిని అక్కడ తాకిన స్కూల్ ప్రిన్సిపాల్.. చితక్కొట్టిన గ్రామస్థులు

బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (21:25 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లాలో ఓ ప్రిన్సిపాల్ కామంతో కళ్లుమూసుకునిపోయాడు. తన వద్ద చదువుకునే విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తాకరాని చోట తాకాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులతో పాటు.. గ్రామస్థులు పట్టుకుని చితక్కొట్టారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని దమ్మపేట మండలం రాచూరిపల్లికి చెందిన ఓ విద్యార్థిని స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈ పాఠశాలలో స్లీవర్ అనే వ్యక్తి ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు. ఈ కామాంధుడు ఆ బాలికపై కొన్నాళ్లుగా కన్నేశాడు. అప్పటి నుంచి ఆమెను లైంగికంగా వేధిస్తూ వస్తున్నాడు.
 
ఈ వేధింపులు భరించలేని విద్యార్థిని తన తల్లిదండ్రులకు బోరున విలపిస్తూ చెప్పింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు చేరుకొని ప్రిన్సిపాల్‌కు దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న దమ్మపేట పోలీసులు అక్కడికి చేరకుని తల్లిదండ్రులకు సర్దిచెప్పారు.
 
ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. సదరు ప్రిన్సిపాల్ విధుల్లో ఉండటానికి వీళ్లేదని, అతన్ని వెంటనే తొలగించాలని పాఠశాల యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు