గోదావరిలో మునిగిన బోటు.. 61 మంది..? వరద ఉద్ధృతి వున్నా.. పర్మిషన్లు..

ఆదివారం, 15 సెప్టెంబరు 2019 (15:05 IST)
గోదావరిలో పడవ మునిగింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద 61 మందితో ప్రయాణిస్తున్న ఓ టూరిజం బోటు మునిగిపోయింది. బోటు పాపికొండలు ప్రాంతానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
ఈ బోటులో ఉన్న కొందరు లైఫ్ జాకెట్ల సాయంతో ఒడ్డుకు చేరినట్టు తెలుస్తోంది.  పోలవరం/గండిపోచమ్మ ఆలయం నుంచి బోటు బయలుదేరిన గంట సేపటి తర్వాత ఈ ఘోరం జరిగినట్టు భావిస్తున్నారు. సంఘటన స్థలికి పోలీసులు, అధికారులు తరలి వెళ్లారు. సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. గజ ఈతగాళ్లు గోదావరిలో మునిగిన వారిని కాపాడేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. 
 
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద రాయల్ వశిష్ఠ అనే పర్యాటక బోటు మునిగిపోయిన ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనలో 15 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరినట్టు తెలుస్తోంది. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో పర్యాటక బోటు ప్రయాణానికి అనుమతినిచ్చిన అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు