రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. బెల్లంకొండ శ్రీనివాస్ ఇంటెన్స్ లుక్ లో కనిపించిన ఈ పోస్టర్ సస్పెన్స్ మరింత పెంచింది, ఆయన ముందు ఒక వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో టెర్రిఫిక్ మాన్షన్ తో పాటు మంటల్లో కాలి పోతున్న వాన్ కనిపించడం థ్రిల్లింగ్ గా వుంది
డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి, కిష్కిందపురి డార్క్, మిస్టీరియస్ వరల్డ్‌ను చూపిస్తూ, దానికి కాంట్రాస్ట్‌గా ఎమోషనల్ మూమెంట్స్ ని చక్కగా మిక్స్ చేశారు. కథ ముందుకు సాగే కొద్దీ థ్రిల్ల్స్‌తో పాటు ఎమోషన్స్ కలిసిన లేయర్డ్ ఎక్స్పీరియెన్స్ ఇవ్వబోతోంది.
సినిమా కోసం టాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సామ్ సి.ఎస్ మ్యూజిక్. చిన్మయ్ సలస్కర్ డీవోపీ, ప్రొడక్షన్ డిజైన్ మనిషా ఎ. దత్, ఆర్ట్ డైరెక్టర్ డి.శివ కమెష్, ఎడిటింగ్ నిరంజన్ దేవరమనే. క్రియేటివ్ హెడ్‌గా జి. కనిష్క, కో-రైటర్‌గా దరహాస్ పళకొళ్ళు, స్క్రిప్ట్ అసోసియేట్‌గా కె. బాల గణేష్ పని చేస్తున్నారు.