ఉపరాష్ట్రపతికి అవమానం!

ఆదివారం, 14 నవంబరు 2021 (18:57 IST)
భారత ఉపరాష్ట్రపతి, తెలుగు తల్లి ముద్దు బిడ్డ ముప్పవరపు వెంకయ్య నాయుడుకు తీవ్ర అవమానం ఎదురైంది. మూడు రోజుల పర్యటన కోసం నెల్లూరు జిల్లాకు వచ్చిన వెంకయ్య ఆదివారం ఢిల్లీకి బయలుదేరారు.

అయితే ఆయనకు కనీసం మంత్రి కూడా వీడ్కోలు పలకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆది నుంచి వెంకయ్య పట్ల చిన్న చూపు చూస్తున్న జగన్ ప్రభుత్వం ఇప్పుడు కూడా దురుద్ధేశంతోనే వ్యవహరించిందన్న విమర్శలు వినవస్తున్నాయి.
 
మూడు రోజుల నెల్లూరు పర్యటన ముగించుకుని ఢిల్లీకి పయనమైన భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకి వెంకటాచలం రైల్వే స్టేషన్ లో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు ఘనంగా వీడ్కోలు పలికారు.

ఆదివారం మధ్యాహ్నం 2.50 గంటల  సమయంలో వెంకటాచలం రైల్వే స్టేషన్ కు చేరుకున్న ఉపరాష్ట్రపతి ప్రత్యేక రైలులో రేణిగుంటకు పయనమవగా  జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, గుంటూరు రేంజ్  డిఐజి త్రివిక్రమ వర్మ, ఎస్పీ విజయరావు, జిల్లా జాయింట్ కలెక్టర్లు హరేంధిర ప్రసాద్, గణేష్ కుమార్, విదేహ్ ఖరె, ట్రైనీ కలెక్టర్ పర్హాన్ అహ్మద్ ఖాన్, ఆర్ డి వో లు చైత్ర వర్షిని, శీనా నాయక్, బిజెపి నేతలు తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు