ఈ థీమ్ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. వివేక్ సాగర్ క్యాచీ ట్యూన్‌కు రామ్ మిర్యాల గాత్రం మరింత ఆకర్షణగా నిలిచింది. సారంగపాణి జాతకం సినిమా ఎలా ఉంటుందో ఈ ఒక్క పాటలోనే చెప్పే ప్రయత్నం చేశారు. ఈ పాటతో సినిమా మీద మరింత ఇంట్రెస్ట్ కలగేజేసే ప్రయత్నం చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా సారంగపాణి జాతకం ఆడియో మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లా ఈ చిత్రం ఉండబోతోందని ట్రైలర్ లో తెలియజేశారు. ఇంకా ఈ చిత్రంలో తణికెళ్ల భరణి, నరేష్, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, వైవా హర్ష వంటి వారంతా నవ్వించబోతోన్నారు.