స్టెరాయిడ్సు మంచివా - చెడ్డవా?

శనివారం, 5 సెప్టెంబరు 2020 (08:14 IST)
స్టెరాయిడ్సు అంత చెడ్డవేమి కావు. నిజం చెప్పాలంటే చేతులెత్తేసిన ఎన్నో జబ్బులకు మెనింజైటెస్, ఎన్కెఫలైటిస్, కోవిడ్ సీరియస్ అయినపుడు ఇవే పెద్ద దిక్కు.

అంతెందుకు ఆస్త్మాకు వాడే ఇన్ హేలర్లు, చర్మవ్యాధులకు వాడే పూతమందులు అన్నింటా ఇవే తమ విశ్వరూపాన్ని చూపిస్తాయి. కోవిడ్ లో సైటోకైన్ స్టార్ము వస్తే ఇదే సంజీవని అని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తేల్చేసింది.

అయితే కొంతమంది వైద్యులు సైటోకైన్ స్టార్మ్ రాకముందే లక్షణాలు మొదలవగానే వాడితే దానిని ఆపవచ్చు అంటున్నారు. చాలామంది మంచి ఫలితాలు కూడా పొందారు. ఎలాగూ ఇప్పటి వైద్యంలో కొందరు సీరియస్ అయి చనిపోతున్నారు, ఇది వాడి కొందరు బ్రతికి తే మంచిదే కదా. 
 
చాలామందికి రక్తం లో ఆక్సిజన్ తగ్గితే "హైపాక్సీమియా" అంటారు, కాని శరీర కణజాలాలు కు ఆక్సిజన్ అందక పోతే "టిస్సూ హైపాక్సియా" అంటారు. 90శాతం-95శాతం ఆక్సిజన్  మధ్య హైపాక్సిమియా ఉన్నా హైపాక్సియా ఉండదు. దానినే "హాప్పీ హైపాక్సియా" అంటారు.

కానీ 90శాతం కంటే పడిపోతే ఆసుపత్రి లో చేరి ఆక్సిజన్, స్టీరాయిడ్సు ఇస్తున్నాము. కాని 95శాతం కంటే తక్కువ కాక ముఁదే ప్రెడ్నోసోలాన్ వాడడం వల్ల సైటోకైన్ స్టార్మ్ రాకుండానే 70శాతం బయట పడతారు. వైరస్ ఎంత  ఉంది అనేది లెక్క కాదు తక్కువ వైరస్ ఉన్నా సైటోకైన్ స్టార్మ్ వచ్చే వారిలో వస్తుంది, ఎవరికి వస్తుంది అనేది ఎవరు చెప్పలేకున్నారు. వైరస్ ను ఆపలేరు ఏమందులతో ఆ అవసరం లేదు కాని సైటోకైన్ స్టార్మ్ ను ఆపవచ్చు.
 
ప్రెడ్నిసాన్ - 40 ఎంజీ,  ప్యాంటాప్- 40 ఎంజీ, ఒక పూట, భోజనం తరువాత, వారం రోజులు లక్షణాలు కనపడగానే వేసుకుంటే నష్ఠం లేదు, పైగా చవకైనవి, అందరికీ అందుబాటులో ఉంటాయి, వంద రూపాయల ఖర్చుతో అయిపోతుంది. ఎలాగూ చాలామందికి బాగయిపోతుంది. ఒకరో ఇద్దరికో బాగకాకపోతే ఆసుపత్రి లో చేరిన తరువాత ఈ స్టీరాయిడ్సే అధిక డోస్లో ఇస్తారు. 
 
వైరస్ లెవల్ పెరుగుతుందని, సుగర్ లెవల్ పెరుగుతుంది అని, అల్సర్లు వస్తాయని, వాడెవడో ఇంకా చెప్పలేదని మనం దీనిమీద అపోహలు అనవసరం. వారం రోజులు వాడడంతో కొంపలేమి మునిగిపోవు, మన ప్రాణాలు తీసేది కాదు, ఇది దివ్య సంజీవనే.

మనం వారంలో వాడే డోసు చాలా చాలా తక్కువ, ఇంతకు వంద రెట్లు డోస్ సీరియస్ అయిన SP బాలసుబ్రమణ్యం లాంటి వాళ్ళకు ఇస్తుంటేనే ఏం కాలేదు, మనకేంటయితాది. ఒక వేళ ఆస్త్మా, సీఓపీడీ ఉంటే చచ్చినట్లు ఇదే వేసుకోవాలి. 
 
65000 ప్లాస్మాథిరపీ ఇస్తేనే ఇంకా చెప్పలేమనే వాళ్ళు, ఖరీదైన మందులు కయితే ఎగిరెగిరి చెప్పేవారు ఏదో చెప్పే లోపల, ఆ వ్యాక్సిన్ వచ్చే లోపల కొంతమందైనా ఈ మందు ద్వారా, వంద రూపాయల వైద్యం ద్వారా సైటోకైన్ స్టార్మ్ రాకుండా, పేదోడి నడ్డి విరగకుండా బయటపడితే మంచిదే కదా.

ఇది అత్యంత చవకైన వైద్యం, దీనికెవరూ వకాల్తా పుచ్చుకోరు, ఏ కంపెనీల సపోర్టు ఉండదు. అదేమన్నా కొత్తదా అంటే ఎడాపెడా వాడేదే, కేవలం వారం, పది రోజుల్లో మనకేం జరగరానిది జరుగదు.  అపోహలు వీడదాం, సైటోకైన్ స్టార్మ్ రాకుండా నే మహమ్మారి నుండి బయటపడి కోలుకుందాం.
 
-- డాక్టర్ సి.ప్రభాకర్ రెడ్డి, కర్నూలు (కోవిడ్ కమాండ్ కంట్రోల్ ప్రత్యేక అధికారి)

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు