చంద్రబాబు రావడంతో సీన్ మారింది.. లగడపాడి సర్వే పక్కా: బుద్ధా వెంకన్న

శనివారం, 8 డిశెంబరు 2018 (12:16 IST)
తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ప్రజా కూటమి విజయం సాధిస్తుందని మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. లగడపాటి సర్వే నిజమవుతుందన్నారు. జాతీయ సర్వేలన్నీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారానికి వెళ్లకముందు చేసినవని.. లగడపాటి సర్వే మాత్రం పక్కా అని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. 
 
చంద్రబాబు రావడంతో సీన్ మారిందని.. బుద్ధా అన్నారు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ కేసీఆర్ తూలనాడటం మొదలైన తర్వాత ఓటర్లలో మార్పు వచ్చిందన్నారు. చంద్రబాబు, రాహుల్ గాంధీ ఒకే వేదికపై కనిపించడం.. ప్రచారం చేయడం ద్వారా ఓటర్లు ప్రజా కూటమివైపు చూశారని, టీఆర్ఎస్ నేతల ఆనందం మూన్నాళ్ల ముచ్చటేనని జోస్యం చెప్పారు. ఎన్నికలు ముగిసి పోలింగ్ బూత్ ముగిసేంత వరకు లగడపాటి సర్వే జరిగిందని.. అందువల్ల తాను దాన్నే నమ్ముతున్నానని బుద్ధ వెంకన్న అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు