ఏకంగా సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. కేంద్ర నిధులు రాష్ట్రంలో స్వార్థ పరులకు ఆదాయ వనరులుగా మారాయని వీర్రాజు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజుపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కనీసం వార్డ్ మెంబర్‌గా గెలవడం కూడా చేతకాని సోము వీర్రాజును ఎమ్మెల్సీగా చేసింది టీడీపీనేనని తెలిపారు.
వీర్రాజు వైకాపాకు ఎంతకు అమ్ముడుపోయారని అడిగారు. టీడీపీ అవినీతి పార్టీ అని విమర్శిస్తున్న వీర్రాజు... అవినీతి పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. వైసీపీ అధినేత జగన్‌ను వీర్రాజు ఎందుకు విమర్శించడం లేదని నిలదీశారు. ఆయనది బీజేపీ అజెండానా? లేక వైసీపీ అజెండానా? అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబును విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బుద్ధా వెంకన్న మండిపడ్డారు.