తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమార్జన చేసి నేర పరిశోధన సంస్థలకు దొరికిపోయి ఐఏఎస్, ఐపీఎస్, పారిశ్రామిక వేత్తలను తనతో పాటు జైలుకు పంపించిన ఘనత జగన్‌దేనని వ్యాఖ్యానించారు.
నీటి పారుదల అభివృద్ధి బోర్డు సమావేశాలకుకానీ, చివరకు జిల్లా పరిషత్ సమావేశాలకు కూడా హాజరు కాని జగన్ నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. వాస్తవాలు ప్రజలకు బాగా తెలుసునని, ముఖ్యంగా ప్రాజెక్టులకు నీరు ఎవరి ద్వారా వస్తున్నాయో పులివెందుల ప్రజలకు మరింత తెలుసునని చెప్పారు.
సొంత తల్లిపై పోటీ చేసిన చిన్నాన్నను ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిపి బిర్యానీ పెడతా... నాలుగు రెట్ల సంపాదన చూపిస్తానంటూ అమాయకులైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను వంచించేందుకు జగన్ జిల్లాలో పర్యటించారన్నారు. జగన్‌ను నమ్మితే బిర్యాని కాదు కదా జైలు చిప్పకూడు తినిపిస్తారని ఆరోపించారు. బాబు వల్లే పులివెందులకు సాగు నీరు వస్తున్న సంగతి ముమ్మాటికీ వాస్తవమని తెలుసుకున్న ప్రజలు జగన్ పార్టీని భూస్థాపితం చేస్తారన్నారు.