రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

ఐవీఆర్

శనివారం, 9 ఆగస్టు 2025 (20:20 IST)
గురుగ్రామ్: రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్, బ్రాండ్ వారి ఫ్లాగ్ షిప్ మ్యూజిక్ ఐపి, యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్ వారి సహకారంలో, రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ ఒరిజినల్స్ క్రింద ఒక తాజా లైన్-అప్‌తో మరలా ముందుకు వచ్చింది. ఇది మెలొడీని, హిప్-హాప్‌ను రంగరించే ఒక విలక్షణమైన ఫార్మాట్. పెహ్లే జైసీ బాత్ నహీ, హూడీ, మొహబ్బత్, ఇమ్తిహాన్ వంటి విజయవంతమైన ట్రాక్స్ తర్వాత ఈ ప్లాట్‌ఫారం ఇప్పుడు, ఈ సీజన్‌లో తన మూడవ ఒరిజనల్, మేబి-అర్మాన్ మలిక్, ఇక్కాల శక్తివంతమైన కొలాబరేషన్‌ను మీ ముందుకు తెస్తోంది.
 
గత మూడు సంవత్సరాలుగా, శక్తివంతమైన ఆన్-గ్రౌండ్ అనుభవాలతో, పలు యూత్ హబ్‌ల వ్యాప్తంగా ప్రేక్షకులను సమ్మోహింపజేసిన తర్వాత- బ్రాండ్ స్ఫూర్తి అయిన లివింగ్ ఇట్ లార్జ్‌ను సంబరంగా వేడుక చేసుకునే సౌండ్ ట్రాక్ లైన తన రెండవ సీజన్ బూమ్ బాక్స్ ఒరిజినల్స్‌తో, రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మరలా ముందుకు వచ్చింది. వివిధ శైలులను, స్వరాలను, సంస్కృతులను మేళవిస్తూ, ద ఒరిజినల్ సౌండ్ ఆఫ్ జనరేషన్ లార్జ్ ను సృష్టిస్తూ-భారతదేశపు సంగీత యవనికను పునర్నిర్వచిస్తూ ముందుకు సాగుతోంది.
 
జనరేషన్ లార్జ్ జీవించి, అనుభవించిన తరహా ప్రేమకు ఈ సౌండ్ ట్రాక్ ఒక నివాళి వంటిది. ఇది ఆశకు సంశయానికి మధ్య మీరు ఊగిసలాడిన, కాలాన్ని నిలిపేసి అదే క్షణంలో ఉండిపోవాలని మీరు కోరుకున్న ఆ మధురమైన ప్రేమ క్షణాలను, ఈ సౌండ్ ట్రాక్ ఒడిసి పట్టుకుంటుంది. ఈ ట్రాక్ వెనుక ఉన్న స్ఫూర్తిని గురించి మాట్లాడుతూ గాయకుడు అర్మాన్ మలిక్ ఇలా అన్నారు, మేబి నిజంగా గుండె లోతుల్లో నుండి వెలికి వచ్చే పాట-నిజాయితీ, భావోద్వేగం నిండి ఉన్నది, ప్రేమలో నిండిన అనిశ్చితమైన భావాలను గురించి చెబుతుంది, గాయకుడు అర్మాన్ మలిక్ ఇంకా ఇలా అన్నారు. ఇక్కాతో కలిసి పని చేయటం ఒక కొత్త శక్తిని, ఒక కొత్త ఒరవడిని ట్రాక్ లో నింపింది. రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ వంటి ప్లాట్ ఫారంలు అపురూపమైనవి. ఎందుకంటే అవి కళాకారులకు, ప్రయోగాలు చేసేందుకు, తమ సామర్ధ్యాలను పెంపొందించుకునేందుకు, ప్రేక్షకులతో అసలైన మార్గంలో కనెక్ట్ చేసుకోగలిగేందుకు అవకాశాన్ని కలిగిస్తాయి.
 
కలిసి పనిచేయటాన్ని గురించి ర్యాపర్ ఇక్కా తన మనసులో భావాలను ఇలా చెప్పారు, మేబి అనేది కేవలం ఒక ప్రేమ గీతం కాదు-అది ఒక వైబ్, మధురమైన సమయాలను మరింతకాలం హత్తుకోవాలన్న మనందరి కోరికకు ఇది ప్రతిబింబం. అర్మాన్తో కలిసి పని చేయటంతో నాకు, సంగీతంలో మృదువైన, మనసు లోతులను తట్టే దిశను తరచి చూసే అవకాశం లభించింది. రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్, కళాకారులు నిజంగా ప్రయోగాలు చేసి, తమను తాము వ్యక్తం చేసుకోగలిగే అవకాశాన్ని కలిగిస్తోంది. అందుకే ఈ కొలాబరేషన్ ఎంతో ప్రత్యేకమైనది."
 
కార్తిక్ మొహీంద్ర, పెర్నోడ్ రికార్డ్ ఇండియాలో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, హెడ్ ఆఫ్ గ్లోబల్ బిజినెస్ డెవలప్ మెంట్, ఇలా అన్నారు, విశ్వజనీనమైన  సంగీతమనే భాషకు, ప్రజలను ఏకం చేసి, మనోహరమైన క్షణాలను సృష్టించే విశిష్ఠమైన శక్తి ఉన్నది. రాయల్ స్టాగ్, సంగీతాన్ని తన కీలకమైన యూత్ ప్యాషన్ పిల్లర్‌గా కొనసాగిస్తోంది. రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ ఒరిజినల్స్‌తో మేము, బాలీవుడ్ మెలొడీలను, ఉర్రూతలూగించే హిప్-హాప్ బీట్లతో మేళవించి, నిజంగా లివింగ్ ఇట్ లార్జ్ అనే బ్రాండ్ ఫిలాసఫీని మరింతగా పెంపొందిస్తూ, కొత్త ఉత్కంఠభరితమైన సౌండ్ స్కేప్‌తో ఈ అనుభవాన్ని మరింత పెంచేందుకు మేము సిద్ధంగా ఉన్నాము.
 
కలిసి పనిచేయటం గురించి మాట్లాడుతూ, ప్రీతి నయ్యర్, SVP బిజినెస్ హెడ్- ఇండియా మరియు దక్షిణ ఆసియా, బ్రాండ్లకు UMG, ఇలా అన్నారు, రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్, పరిచయమున్న సంగీతాన్ని దాటుకుని, కొత్త సంగీత తీరాలను కనుగొనేందుకు తెగువతో కూడిన భావానికి, సృజనాత్మక స్వాతంత్ర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. UMG ఫర్ బ్రాండ్స్‌లో, ప్రయోగాలు చేసేందుకు, వేరువేరు శైలులను మేళవించేందుకు, యువతతో మాట్లాడే సంగీతాన్ని సృష్టించేందుకు కళాకాలృరులకు వేదికను అందించే ప్లాట్ ఫారంకు సహకారాన్ని అందించటం మాకు గర్వకారణం. రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ ఒరిజినల్స్, వేరు వేరు సంగీత ప్రపంచాల నుండి అమోఘమైన స్వరాలను తెచ్చి, వాటిని మరపురాని కొలాబరేషన్లుగా మార్చటం కొనసాగిస్తోంది. భారతదేశంలో ఇది ఆవిర్భవిస్తున్న స్వరాలకు నిజమైన ప్రతీక.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు