విద్యా రంగం లో ఉపాధ్యాయులు,అధ్యాపకులు,ప్రొఫెసర్లు,ఇతర సిబ్బంది కి కూడా ఈ నెల లో వాక్సిన్ వేయడానికి ఇప్పటికే ప్రజారోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. ఇప్పటికే అందరు అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడి దీనిపై సూచనలు చేశామన్నారు.
కళాశాలల ప్రాంతీయ విద్యాధికారులు, పాఠశాల ప్రాంతీయ విద్యా సంచాలకులు, జిల్లా విద్యా శాఖ అధికారులు, విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్లు ఈ మేరకు సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్లు (అభివృద్ధి), జిల్లా వైద్యాశాఖధికారులతో సంప్రదించి సమన్వయం చేసుకోవాలని ఆదేశించినట్లు మంత్రి సురేష్ తెలిపారు.