దీంతో భరత్ ప్రమాదంలోనే మరణించారని తెలిసినా.. ఆ ప్రమాదానికి ముందు కొన్ని గంటలు జరిగిన పరిణామాలు కూడా అనుమానాలకు తావిస్తున్నాయి. భరత్ కారు నోవోటెల్ మెయిన్‌గేటులోకి ప్రవేశించినట్లు సీసీటీవీ పుటేజ్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. నోవోటెల్‌లో భరత్‌తో పాటు పార్టీలో పాల్గొన్నవారిలో ఒకరిని పోలీసులు గుర్తించారు. అతని పేరు రాజు అని తెలిసింది. అతన్ని విచారిస్తే మరికొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. భరత్, ఇతను కలిసి హోట్‌ల్‌లో ఓ రూమ్ తీసుకున్నట్లు సమాచారం.
ఇకపోతే.. భరత్ మరణించిన తర్వాత జరిగిన విషయాలు కూడా చాలావరకు ఆశ్చర్యకరంగానే ఉన్నాయి. అంత్యక్రియలకు మరో సోదరుడు రఘు మినహా, అన్న రవితేజ, తల్లి రాజ్యలక్ష్మిలు, ఇతర కుటుంబ సభ్యులెవ్వరూ రాకపోవడం, సోమవారం ఓ సినిమా షూటింగ్‌కు రవితేజ హాజరుకావడం వంటివి అనేక ప్రశ్నలకు కారణమయ్యాయి.