రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు ఎస్సీ ఎస్టీ బలహీన, మైనారిటీ వర్గాలకు సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.ఆ నాటి వైయస్ ఆర్ దగ్గర నుంచే నేటి సిఎం జగన్మోహన్ రెడ్డి వరకు పేదలను ఆదరించి,అభివృద్ధి చేసే గుణం కలిగిఉన్నవారని గుర్తు చేశారు..తనపై నమ్మకం ఉంచి మంత్రిగా అవకాశం కల్పించిన నేపథ్యంలో,తన బాధ్యతలను సమర్ధ వంతంగా నిర్వహించి,సిఎం జగన్ కు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు వస్తానని వెల్లడించారు.
కార్యక్రమంలో రహదారులు-భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి టి.కృష్ణబాబు,రాష్ట్ర గ్రామీణ రహదారుల చీఫ్ ఇంజనీరింగ్ అధికారి వేణుగోపాల రెడ్డి,రాష్ట్ర రహదారులు-భవనాలశాఖ చీఫ్ ఇంజనీర్ నియీముల్లా,నేషనల్ హైవేస్ చీఫ్ ఇంజనీర్ రామచంద్ర,రాష్ట్ర రహదారులు- భవనాలశాఖ కార్పోరేషన్ చీఫ్ ఇంజనీర్ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.