ఏపీలో సెప్టెంబరు 5న పాఠశాలలు ప్రారంభం

మంగళవారం, 28 జులై 2020 (17:42 IST)
కరోనా భయంతో తమ బిడ్డలను పాఠశాలలకు పంపేందుకు తల్లి తండ్రులు వెనకడుగు వేస్తున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం పాఠశాలల నిర్వహణకు ముందడుగే వేస్తోంది.

ఆగస్టు 31 నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి కావాలని, సెప్టెంబరు 5న పాఠశాలలు ప్రారంభం అవుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. నాడు-నేడు పనులపై రెండ్రోజులకు ఒకసారి కలెక్టర్ సమీక్ష చేయాలని జగన్ ఆదేశించారు.

ఎట్టి పరిస్థితుల్లోను అలక్ష్యం ప్రదర్శించరాదని పేర్కొన్నారు. ఆగస్టు 15న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని, ఇళ్లపట్టాల రిజిస్ట్రేషన్‍కు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు.

పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు