ఆంధ్రప్రదేశ్‌లో కర్ర సాము ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించిన ఉషా

ఐవీఆర్

సోమవారం, 7 అక్టోబరు 2024 (23:05 IST)
భారతదేశంలోని ప్రముఖ కన్స్యూమర్ డ్యూరబుల్స్ బ్రాండ్ ఉషా ఇంటర్నేషనల్, వాసవ్య మహిళా మండలితో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని స్వదేశీ మార్షల్ ఆర్ట్‌ రూపమైన కర్ర సామును వేడుక చేస్తూ కర్ర సాము ఛాంపియన్‌షిప్ 2024ను నిర్వహించింది. ఈ కార్యక్రమం గుంటూరు రూరల్‌, ఏటుకూరులోని జెడ్‌పి స్కూల్‌లో జరిగింది. రోజంతా జరిగిన ఈ పోటీలో అధికారులు, వాలంటీర్లు, ఉషా సిలై స్కూల్ ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని సజావుగా సాగేలా చూసారు. ఈ పోటీలో రిషి, మహాలక్ష్మి వరుసగా 18 ఏళ్లలోపు బాలురు, 18 ఏళ్లలోపు బాలికలలో మొదటి బహుమతిని గెలుచుకున్నారు.
 
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీమతి దాసరి లక్ష్మీదుర్గ , శ్రీ యు సీతారామయ్య, మాజీ అధ్యక్షుడు, ఏటుకూరు; శ్రీమతి వై. వాణి, ప్రధానోపాధ్యాయురాలు, జెపి ఉన్నత పాఠశాల, ఏటుకూరు; శ్రీమతి రష్మి, కార్యదర్శి, వాసవ్య మహిళా మండలి; శ్రీమతి రాజ్యలక్ష్మి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎక్స్‌పర్ట్, గుంటూరు; శ్రీ బసవ లింగ రావు, సాంకేతిక నిపుణుడు; మరియు శ్రీ జి . సుబ్బారావు, గ్రాండ్ మాస్టర్, కావటి కర్ర సాము ట్రైనింగ్ సొసైటీ, గుంటూరు పాల్గొని విజేతలకు అవార్డు లను అందించారు. 
 
ఉషా ఇంటర్నేషనల్‌ వద్ద స్పోర్ట్స్ ఇనిషియేటివ్స్ & అసోసియేషన్స్ హెడ్ కోమల్ మెహ్రా మాట్లాడుతూ “స్థానిక ప్రతిభావంతుల కర్ర సామును చూడటం నిజంగా ఆనందంగా ఉంది. ఇలాంటి సాంప్రదాయ యుద్ధ కళలలో భాగం కావడం,  మన ఆరోగ్య పరంగా చురుకుగా ఉండడం ఎంత ముఖ్యమో చూపిస్తుంది" అని అన్నారు. 
 
కేటగిరీ వారీగా విజేత వివరాలు:
18 ఏళ్లలోపు బాలికలు
1వ బహుమతి మహాలక్ష్మి
2వ బహుమతి  పల్లవి
3వ బహుమతి  ప్రియ
4వ బహుమతి నవ్య లక్ష్మి
ఉత్తమ ప్రదర్శనలు: అఖిల, శరణ్య
 
18 ఏళ్లలోపు బాలురు
1వ బహుమతి ఋషి
2వ బహుమతి నరసింహ
3వ బహుమతి  భానుప్రసాద్
4వ బహుమతి వంశీ
ఉత్తమ ప్రదర్శనలు: విశ్వనాథం, గణేష్
 
జట్టు విజేతలు
ZP స్కూల్, ఏటుకూరు (బాలురు & బాలికలు)
బాలకుటీర్ టీమ్, గుంటూరు (బాలురు)
కాటూరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ (బాలుర)
కేంద్రీయ విద్యాలయం, నల్లపాడు (బాలికలు)
SKBM ఉన్నత పాఠశాల, గుంటూరు (బాలికలు)

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు