కోరిక తీర్చమని మహిళతో వాలంటీర్ అసభ్య ప్రవర్తన, ఫిర్యాదుతో అరెస్ట్
శనివారం, 29 ఆగస్టు 2020 (18:19 IST)
పల్లెను ప్రగతి పథంలో నడిపించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. దీనికోసం వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాని కొన్నిచోట్ల వాలంటీర్లు తమ విధులను సరిగ్గా నిర్వహించడం లేదు. కర్నూల్‌లో అయితే ఓ వాలంటీర్ రెచ్చిపోయాడు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించి ఆ వ్యవస్థకే భంగం కలిగించే పని చేసాడు.
కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం బీ కోడూరులో ఈ ఘటన జిరిగింది. అదే గ్రామానికి చెందిన వాలంటీర్ సుఖాన్, మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. తన కోరికను తీర్చాలని వేధించాడు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి సాయం చేయాలని కోరితే వేధిస్తున్నాడని ఆమె వాపోయింది.
వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వాలంటీర్ సుఖానుని అరెస్ట్ చేసినట్లు నంద్యాల సీఐ మల్లికార్జున తెలిపారు. ఈ సంఘటన పెద్ద కలకలం రేపింది. వాలంటీర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.