ముంబైలో మంగళవారం రాత్రి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఎస్వీబీసీ సిఈవో సురేష్ కుమార్ తో పాటు సుబ్బారెడ్డి సిఎం ను కలిశారు. ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి సహకారం అందించాలని సీఎం ను చైర్మన్ కోరారు.
గత ప్రభుత్వం కేటాయించిన భూమి పరిశీలించాలని, అది అనువుగా లేదనుకుంటే ఇంకో చోట భూమి కేటాయిస్తామని ఠాక్రే చెప్పారు. ఎస్వీబీసీ హింది చానల్ ను ఉగాదికి ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చైర్మన్ వివరించారు.
అన్ని విధాలా సహకరిస్తాం : ముంబై సలహామండలి హామీ
ముంబైలో శ్రీవారి ఆలయం, ఎస్వీబీసీ హింది చానల్ ఏర్పాటుకు అన్ని విధాలా సహకరిస్తామని స్థానిక సలహామండలి సభ్యులు హామీ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి,ఎస్వీబీసీ సిఈవో సురేష్ కుమార్ సలహామండలి సభ్యులతో సమావేశమయ్యారు.