శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

శుక్రవారం, 15 జనవరి 2021 (14:04 IST)
పవిత్రమైన ధనుర్మాసం గురు‌వారం ముగియడంతో శుక్ర‌‌వారం ఉద‌యం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభ‌మైంది.

గత ఏడాది డిసెంబరు 16వ తేదీ నుంచి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో డిసెంబరు 17వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది.

అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తికావడంతో, జనవరి 15వ తేదీ శుక్ర‌‌వారం నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు