కథలు చెప్తామంటూ.. మహిళల్ని లోబర్చుకుని అత్యాచారం చేసేవాడు.. ఆపై హత్య కూడా...?

ఆదివారం, 15 జనవరి 2017 (18:31 IST)
కథలు చెప్తామంటూ.. తిరుగుతూ తన మాటల చాతుర్యంతో మహిళలను లోబర్చుకోవడంపై అత్యాచారం చేసే కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కపిలేశ్వరం మండలం కేదారిలంకకు చెందిన సలాది లక్ష్మీనారాయణ.. దుర్గాదేవి, వెంకన్నబాబుల కథలు చెబుతుంటారు. కథ చెప్పేందుకు పరిసర గ్రామాలకు వెళ్లిన సమయాల్లో అమాయక మహిళలను తన మాయమాటలతో లక్ష్మీనారాయణ లోబర్చుకొనేవాడు.
 
నెల రోజుల క్రితం మామిడికుదురులోని ఆల్ క్యాస్ట్ కాలనీకి కథ చెప్పేందుకు వెళ్ళాడు. ఆ సమయంలో చేపూరి భాగ్యవతితో పరిచయం పెంచుకున్నాడు. ఈ నెల 8వ, తేదిన పిచ్చుక లకం, వెలాపులంక మద్య ఇసుకదిబ్బలలోకి ఆమెను తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన తర్వాత జేబు రుమాలుతో ఆమె గొంతు బిగించి చంపాడు. ఆమె చెవిదిద్దులు, కాళ్ళపట్టీలు, సెలో ఫోన్ తీసుకొని మృతదేహన్ని అక్కడే వదిలివెళ్ళిపోయాడు. 
 
2012లో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం మద్దురిలంకకు చెందిన ఆకుల నాగమణి, 2014 లో యానాంకు చెందిన సత్యవతి, దంగేరుకు చెందిన మరో వివాహితను, 2015 ఫిబ్రవరిలో మలికిపురం మండలం కేశనపల్లికి చెందిన బద్రి సత్యవతిని ఇదే రకంగా హత్య చేసినట్టు పోలీసులు విచారణలో తేలింది.

వెబ్దునియా పై చదవండి