పెట్రోల్ పాపం కేంద్రానిదే, రాష్ట్రాలకు ఏం సంబంధం? : యనమల

మంగళవారం, 22 మే 2018 (15:55 IST)
రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో మధ్యతరగతి ప్రజలపై ఎక్కువ భారం పడుతుందన్నారు ఆంద్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. ఇంటర్నేషనల్ మర్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడల్లా దేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా ధరలు పెంచడం దారుణమన్నారు. దీనివల్ల ప్రజలపై తీవ్రమైన భారం పడుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల మీద ఎక్కువ భారం పడుతుందని తెలిపారు. 
 
అదే క్రూడ్ ఆయిల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గినప్పుడు ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. పెట్రోల్ ధరలు తగ్గించమని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించడం మంచి పద్ధతి కాదన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు.. ఆ భారం ప్రజలపై పడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు