నేను చేయలేను అని అనవద్దు... స్వామి వివేకానంద

సోమవారం, 21 మే 2018 (20:19 IST)
1. ఆత్మ విశ్వాసం కలిగి ఉండండి. గొప్ప విశ్వాసాల నుండే మహత్తరకార్యాలు సాధించబడతాయి.
 
2. ఆత్మవిశ్వాసం  కలిగి ఉండండి. మీరందరు ఒకప్పటి వేదఋషులు. ఇప్పుడు మీరు వేరు రూపాలలో వచ్చారు. అంతే తేడా... మీ అందరిలో అనంత శక్తి ఉంది. పగటివేళ కాంతిలాగా ఈ విషయాన్ని స్పష్టంగా చూస్తున్నాను. ఈ శక్తిని జాగృతం చేయండి. మేల్కోండి...
 
3. అభివృద్ధి చెందడానికి మెుదట మనపై తరువాత భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండాలి. తనపై విశ్వాసం లేనివానికి  భగవంతునిపై విశ్వాసం కలగడం కల్ల.
 
4. నీలో అనంతశక్తి ఉందని విశ్వాసం కలిగి ఉండు. జాగరూకుడవై ఆ శక్తిని వ్యక్తపరచు. నేను ఏదైనా సాధించగలను అని సంకల్పించు. పాము విషం కూడా గట్టిగా తిరస్కరిస్తే మీ పట్ల నిర్వీర్యమైపోతుంది. జాగ్రత్త... చేయలేను అని అనవద్దు. ప్రతికూల భావనలు రాకూడదు.
 
5. మనకు కావలసింది శ్రద్ధ... మనిషికి మనిషికి మధ్య తేడా శ్రద్ధలో ఉన్న తారతమ్యమే గాని వేరేమీ కాదు. ఒక మనిషిని గొప్పవాడుగాను, ఇంకొకరిని బలహీనుడిగాను అధముడుగాను చేసేది శ్రద్ధే. కాబట్టి ఈ శ్రద్ధ మీలో ఉండాలి.
 
6. అపార విశ్వాసం, అనంత శక్తి ఇవే విజయసాధనకు మార్గాలు.
 
7. ధృడసంకల్పం, పవిత్ర ఆశయం తప్పక సత్ఫలితాలను ఇస్తాయి. వీటిని ఆయుధాలుగా గ్రహించిన వారు కొద్దిమందే అయినా, అన్ని విఘ్నాలను ఎదుర్కొని నిలువగలుగుతారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు