కరోనా కాటుకు మతం రంగు లేదంటూ, జరిగిన దురదృష్టకరమైన సంఘటనకి మతపరమైన రంగు అపాదించరాదని ప్రకటన చేసిన ముఖ్యమంత్రి సంయమనం ఆలోచనాత్మకమని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మిప్రసాద్, సభ్యుడు ఆచార్య చందు సుబ్బారావు అన్నారు.
ఈ తరహా సంఘటనలు ఏ ఆధ్యాత్మిక సమావేశంలో జరిగే అవకాశం ఉందని, మనం మనుషులుగా వేరైనప్పటికీ ఐకమత్యంతో పోరాడాలని పిలుపునిచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరెందరికో మార్గదర్శిగా నిలిచారని యార్లగడ్డ ప్రస్తుతించారు.