ఇందులో భాగంగా తన అనుచరులతో కలిసి నిన్న ఉదయం హైదాబాదులోని ఎన్టీఆర్ భవన్‌కు బయలుదేరారు. ముందు ఆయన వాహనంలో వెళ్తుండగా మరో వందమంది ఆయన అనుచరులు ఎడెనిమిది వాహనాల్లో బయలు దేరారు. అయితే వారు మిర్యాలగూడ చేరుకునేసరికి గుర్తు తెలియని వ్యక్తులు వెంకటరెడ్డిని కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. దీంతో తమ అనుచరులు ఏమీ చేయలేక వెనుదిరిగారు.
విషయం తెలుసుకున్న వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే సాయంత్రం ఏడు గంటల సమయంలో తాను హైదరాబాదులో క్షేమంగా ఉన్నానని ఫోన్లో తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్నాళ్లుగా వైసీపీపై విరక్తి చెందిన వెంకట రెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేరనీయకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఇదంతా వైసీపీ కుట్ర అని తెలిపారు. కానీ దీనిపై కేసు నమోదు కాలేదు.